బిగ్‌ స్క్రీన్‌ అనుభూతే వేరు

27 Apr, 2020 05:37 IST|Sakshi
బెక్కం వేణు గోపాల్‌

‘‘ప్రస్తుతం అందరూ ఓటీటీ వేదికల్లో సినిమాలు చూస్తున్నారు. కానీ ఈ ప్రభావం థియేటర్స్‌ మీద ఉండదనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్‌కి ప్రత్యామ్నాయం థియేటరే. బిగ్‌ స్క్రీన్‌ అనుభూతే వేరు’’  అన్నారు నిర్మాత బెక్కం వేణు గోపాల్‌. ‘టాటా బిర్లా మధ్యలో లైలా, ప్రేమ ఇష్క్‌ కాదల్, హుషారు’ వంటి సినిమాలు నిర్మించారాయన. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా బెక్కం వేణు గోపాల్‌ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోవాలని కోరుకుంటున్నాను.

అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. కరోనా ప్రభావం అన్ని ఇండస్ట్రీలపై ఉంది. దీన్ని అందరూ బాధ్యతగా భావించి పోరాడాలి. ఓటీటీ ప్రభావం థియేటర్స్‌ మీద ఉండదు. ఇంటర్నెట్‌ వచ్చిన కొత్తలో సినిమాలకు రారు అన్నారు. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం విశ్వక్‌ సేన్‌తో ‘పాగల్‌’ అనే సినిమా చేస్తున్నాను. లాక్‌ డౌన్‌ తర్వాత షూటింగ్‌ మొదలుపెడతాం. ఆ తర్వాత శ్రీ విష్ణుతో కూడా ఓ సినిమా ప్లాన్‌  చేశాం. ‘రోటీ– కపడా– రొమాన్స్‌’ అనే మరో సినిమా కూడా ప్లాన్‌ చేస్తున్నాం. అలాగే ‘దిల్‌’ రాజుగారితో కొన్ని సినిమాలు కలసి చేయబోతున్నాను’’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు