నా ఆర్మీ నాకుంది : బిగ్‌బాస్‌ భామ

30 Nov, 2019 11:55 IST|Sakshi

చెన్నై : తనకు తన ఆర్మీ ఉందిగా అని చెప్పుకొచ్చింది నటి ఓవియ. కలవాని చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మలయాళీ కుట్టి ఈ జాణ. తొలి చిత్రమే మంచి పేరు తెచ్చి పెట్టడంతో ఇక్కడ అవకాశాలు వరుసకట్టాయి. వాటిలో చాలా తక్కువ చిత్రాలే సక్సెస్‌ కావడంతో ఓవియ మార్కెట్‌ ఒక్క సారిగా పడిపోయ్యింది. అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అలాంటి సమయంలో బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో రూపంలో ఈ అమ్మడికి మరోసారి క్రేజ్‌ వచ్చింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో సహ నటుడు ఆరవ్‌తో ప్రేమాయణం, అది బెడిసి కొట్టడం, ఆత్మహత్యాయత్నం వంటి సంఘటనలు ఓవియను సంచలన నటిగా మార్చేశాయి.

దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత నటిగా మరోసారి క్రేజ్‌ పెరిగింది. అయితే దాన్ని ఓవియ సరిగ్గా ఉపయోగించుకోలేదు. అదే సమయంలో 90 ఎంఎల్‌ వంటి గ్లామరస్‌ కథా చిత్రంలో నటించడం తన కెరీర్‌కు పెద్ద డ్యామేజ్‌ అయ్యింది. అందులో మద్యం తాగడం, పొగత్రాగడం వంటి సన్నివేశాల్లో నటించి తీవ్ర విమర్శలకు గురైంది. అయితే అలా నటించడాన్ని ఈ అమ్మడు సమర్థించుకుంది. దీంతో వచ్చే అవకాశాల ను కూడా కోల్పోయింది. ప్రస్తుతం అవకాశాల్లేని ఓవియ తరచూ ఫేస్‌బుక్‌లో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఈమెకు ఫేస్‌బుక్‌ ఫాలోయింగ్‌ కాస్త ఎక్కువే. అలా అభిమానుల  ప్రశ్నలకు బదులిస్తుంటుంది. 

సంచలన నటి పేరు రాజకీయంగా దుమారం రేపింది. కారణం ఈ మధ్య ఒక టీవీ చానల్‌కిచ్చిన భేటీలో రజనీకాంత్, కమలహాసన్‌ రాజకీయరంగప్రవేశం గురించి అడిగిన ప్రశ్న ఓవియను చిరెత్తించింది. అందుకు తాను బదులివ్వనని చెప్పింది. అయినా రజనీ, కమల్‌ రాజకీయాల గురించి తనను అడుగుతారేంటీ అని ఆవేశంగా ఎదురు ప్రశ్నవేసింది. అంతే కాదు ఈ విషయం గురించి తన ట్విట్టర్‌లో పేర్కొంటూ రాజకీయాలతో సంబంధం లేని నటీనటులను రాజకీయాల గురించి అడగడాన్ని మీడియా మానుకోవాలని హితవు పలికింది. ఇలాంటి ప్రశ్నలను ప్రజలను అడిగితే వేరే విధంగా సమాధానాలు వస్తాయని ట్విట్టర్‌లో పేర్కొంది.  ఒక నెటిజన్‌ మీరు కూడా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించవచ్చుగా అని అన్నారు. అందుకు తనకంటూ ఒక ఆర్మీ ఉందిగా అని బదులిచ్చింది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా