దేశం కోసం మనమేం చేశామనుకుంటారు!

28 Nov, 2017 23:51 IST|Sakshi

‘‘ఆడియన్స్‌ అటెన్షన్‌ డ్రా చేయడం కష్టంగా మారింది. ఓన్లీ టెక్నాలజీ, ఎఫెక్ట్స్‌తో వారిని థియేటర్లకు రప్పించలేం. సినిమాలో మంచి కంటెంట్‌ కావాలి. ‘ఆక్సిజన్‌’లో కంటెంట్‌ ఉంది. సినిమా చూశాక, దేశం కోసం మనమేం చేశాం? అని ప్రేక్షకులు ఆలోచిస్తారు’’ అన్నారు ఏయమ్‌ జ్యోతికృష్ణ. గోపీచంద్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్‌’. రాశీ ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లు. రేపు విడుదలవుతున్న ఈ చిత్రం గురించి జ్యోతికృష్ణ చెప్పిన విశేషాలు...

ముందు గోపీచంద్‌గారికి కథ చెప్పాను. ఓకే అన్నారు. నేను వేరే నిర్మాతను ఎవరినన్నా చుద్దామన్నా. ‘మంచి కథ. సోషల్‌ కంటెంట్‌ ఉంది. ఏయం రత్నంగారి ఆధ్వర్యంలో నిర్మిస్తే ఇంకా హ్యాపీగా ఫీలవుతా’ అన్నారు. తర్వాత మా నాన్న (ఏయం రత్నం) గారికి కథ చెప్పా. చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఫైనల్‌గా సినిమా చూసి, ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. నా భార్య మంచి క్రిటిక్‌. తను సినిమా బాగుందని చెప్పింది. 

♦ కమర్షియల్‌ అంశాలతో కూడిన సందేశాత్మక చిత్రమిది. ఇందులో మూడు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. అవేంటో తెరపై చూస్తే ప్రేక్షకులు థ్రిల్లవుతారు. గోపీచంద్‌గారు బాగా నటించారు. ఆయన క్యారెక్టరైజేషన్‌లో మూడు రకాల షేడ్స్‌ ఉంటాయి. ఆయన ఇమేజ్‌ ఈ సినిమాతో మరింత పెరుగుతుంది. ఈ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉంది. 

♦ 8 నెలల క్రితమే మూవీ రెడీ. గ్రాఫిక్‌ వర్క్‌కి ఎక్కువ టైమ్‌ పట్టింది. ఈ సినిమాకు ఆరుగురు కెమెరామెన్‌ వర్క్‌ చేశారు. ఏ ఎపిసోడ్‌కి ఆ ఫీల్‌ ఉండే కెమెరామన్‌ వచ్చారు.

♦  దర్శకుడిగా నా తొలి సినిమా తర్వాత తెలుగులో మరో చాన్స్‌ కోసం ప్రయత్నించాను కానీ రాలేదు. ఆ తర్వాత ప్రొడక్షన్‌ వైపు దృష్టి పెట్టి, బిజీ అయ్యా. తమిళంలో ‘ఎన్నై అరిందాల్‌’ (తెలుగులో ‘ఎంతవాడు కానీ’) ప్రొడక్షన్‌ పనులు చూసుకున్నాక, ‘ఆక్సిజన్‌’ కథ రెడీ చేసి మళ్లీ దర్శకుడిగా మారా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా