బాగున్నా బాగా లేదనడం న్యాయం కాదు

3 Dec, 2017 01:02 IST|Sakshi

‘‘ సోషల్‌ మీడియా బాగా అడ్వాన్స్‌ అయిపోయింది. సినిమా షో కంప్లీట్‌ అయ్యే లోపే సినిమా రిజల్ట్‌ను తేల్చేస్తున్నారు. పాత రోజుల్లో సినిమా రివ్యూలను వారం లేదా పది రోజుల తర్వాత రాసేవారు. ఇప్పుడు షో తర్వాతే రేటింగ్‌లు ఇచ్చేస్తున్నారు. బాగాలేని సినిమాని బాగుందని రాయమని అడగం. కానీ, బాగున్న సినిమాని బాగాలేదని రాయడం న్యాయం కాదు.

ఇది నా సొంత అభిప్రాయం’’ అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. గోపీచంద్‌ కథానాయకుడిగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎస్‌. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్‌’. గురువారం విడుదల అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏ.ఎం. రత్నం విలేకర్లతో చెప్పిన విశేషాలు...

► కమర్షియల్‌ అంశాలతో పాటు మెసేజ్‌ ఉన్న సినిమా ‘ఆక్సిజన్‌’. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మౌత్‌ టాక్‌ బాగుంది. కలెక్షన్స్‌ బాగా వస్తున్నాయి. ప్రజెంట్‌ డేస్‌లో సందేశాత్మక చిత్రాలకు ప్రేక్షకాదరణ తగ్గింది. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు ఎంటర్‌టైన్‌ చేస్తూనే ప్రేక్షకులకు మంచి మేసేజ్‌ ఇచ్చాయి. సినిమాలు చూసి ప్రజలు సడన్‌గా మారతారని అనుకోను. వారు ఆలోచిస్తే చాలు అన్నదే మా ప్రయత్నం. అప్పట్లో ‘కర్తవ్యం’ సినిమా చాలామంది మహిళలను ఇన్‌స్పైర్‌ చేసింది.

► ‘ఆక్సిజన్‌’ ఏ లాంగ్వేజ్‌లో అయినా బాగుంటుంది. ‘హిందీలో తీద్దాం. అక్షయ్‌కుమార్, అజయ్‌ దేవ్‌గణ్‌లకు చూపిద్దాం’ అని నా ఫ్రెండ్‌ అన్నాడు. సినిమా రిలీజ్‌ కాకముందు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌కు చూపిద్దామనుకున్నా. తమిళ రీమేక్‌ ఆలోచన ఉంది. పవన్‌ కల్యాణ్‌తో ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్‌ అంటే.. అది ఆయనే డిసైడ్‌ చేస్తారు. ఇకపై తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్‌ చేయాలనుకుంటున్నాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా