ఐష్‌ స్థానంలో కాజల్‌ అగర్వాల్‌

26 Oct, 2017 05:30 IST|Sakshi

తమిళసినిమా: కాలం కలిసొస్తే అంటారే అలాంటి టైమ్‌ ఇప్పుడు నటి కాజల్‌అగర్వాల్‌కు నడుస్తోందని చెప్పావచ్చు. విజయాలను బట్టే అవకాశాలు వరిస్తుంటా యి. అలా తెలుగులో నేనేరాజా నేనేమంత్రి, తమిళంలో, వివేగం, మెర్శల్‌ చిత్రాల సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న నటి కాజల్‌ అగర్వాల్‌ను ఇప్పటి వరకూ గ్లామరస్‌ పాత్రల్లోనే చూశాం. తాజాగా ముఖ్యంగా కోలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో చూడబోతున్నాం. ఇటీవల అలాంటి చిత్రాలను నటి నయనతార పోషిస్తున్నారు. ఇక కాజల్‌అగర్వాల్‌ కూడా నేను సైతం అంటున్నారు.

ఇప్పటికే హిందీ చిత్ర క్వీన్‌ రీమేక్‌లో నటిస్తున్న ఈ భామను తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. దక్షిణాదిలో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు పి.వాసు ఇటీవల శివలింగ చిత్రంతో సక్సెస్‌ అందుకున్నారు. తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో బాలీవుడ్‌ సుందరి ఐశ్వర్యను నటింపజేయాలని భావించారు. అందుకు ఆమెతో చర్యలు కూడా జరిగాయనే ప్రచారం జరిగింది. అయితే ఆ పాత్ర తాజాగా నటి కాజల్‌అగర్వాల్‌ను వరించింది. ఐష్‌ స్థానాన్ని ఈ ముద్దుగుమ్మ భర్తీ చేస్తున్నారన్న మాట. మరి లక్కంటే ఇదే మరి. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు