శర్వానంద్‌ సెల్ఫ్‌మేడ్‌ హీరో

18 Dec, 2018 01:52 IST|Sakshi
సుధాకర్‌ చెరుకూరి, హను రాఘవపూడి, శర్వానంద్, అల్లు అర్జున్, సాయి పల్లవి, విశాల్‌ చంద్రశేఖర్, కృష్ణకాంత్, చంద్రు, జేకే

అల్లు అర్జున్‌

‘‘ఆ మధ్య ఓ దర్శకుడు నాతో ‘శర్వా చాలా లిమిటెడ్‌ యాక్టర్‌’ అని అన్నారు. ‘స్కోప్‌ వస్తే ఏదైనా చేసే కెపాసిటీ తనకుంది’ అని నేను అన్నాను. తర్వాత ‘రన్‌ రాజా రన్‌’ రిలీజైంది. అది చూసి పిచ్చెక్కిపోయింది ఆ దర్శకుడికి. ఆయన నాకు ఫోన్‌ చేసి ‘స్వామీ.. నేను ఒప్పుకుంటాను. శర్వా ఏదైనా చేయగలడు’ అన్నారు. శర్వా సెల్ఫ్‌మేడ్‌ హీరో. అతని ఫంక్షన్‌కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’.

చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అర్జున్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ట్రైలర్‌ నాకు చాలా నచ్చింది. బేసిక్‌గా లవ్‌ స్టోరీలంటే నాకు చాలా ఇష్టం. (ప్రేక్షకులు అరుస్తుంటే) ఏంటి అరుస్తున్నారు? నాకు పెళ్లి అయిపోయిందనా? ‘ఇంద్ర’  సినిమా స్టైల్‌లో చెప్పాలంటే ‘అదే యూత్‌.. అదే ఎనర్జీ’. ఈ చిత్రం ట్రైలర్‌లో మ్యాజిక్‌ కనిపించింది. మంచి సినిమాతో నిర్మాతగా మారిన సుధాకర్‌గారికి ఆల్‌ ది బెస్ట్‌.

సాహిత్యం అందించిన కేకేగారికి, రచించిన హనుగారికి నా రెస్పెక్ట్‌. రచయితలను గౌరవించుకోవాలి. సాంకేతిక నిపుణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో నా కార్‌లో మ్యాగ్జిమమ్‌ విన్నది ‘పడి పడి..’ పాటలే. మ్యూజిక్‌ డైరెక్టర్‌ విశాల్‌గారు పెద్ద పెద్ద హిట్లు ఇవ్వాలి. ‘ప్రేమమ్‌’, ఎంసీఏ, ఫిదా’లో సాయిపల్లవిని చూశాను. తనతో ఒకవేళ సినిమాలు చేస్తే సీన్స్‌ కన్నా కూడా సాంగ్స్‌ ఎప్పుడు చేస్తానా? అని వెయిట్‌ చేస్తున్నా. ‘ఫిదా’లో ‘వచ్చిండే..’ సాంగ్‌ని నేను చూసినన్నిసార్లు సాయిపల్లవి కూడా చూసుకొని ఉండదు.

నా ఫేవరెట్‌ హీరోయిన్స్, డ్యాన్సర్స్, పెర్ఫార్మర్స్‌లో సాయి పల్లవి ఒకరు. మీకో (సాయి పల్లవిని ఉద్దేశించి) పెద్ద స్టార్‌ హీరో ఫ్యాన్‌ ఉన్నారు. ఆయన  ఎవరో మాత్రం నేను చెప్పను. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, లై’ సినిమాల్లో లవ్‌ట్రాక్‌లు చాలా బావుంటాయి. హనుతో ఓ లవ్‌స్టోరీ చేయాలి అనుకున్నాను. కానీ శర్వా ఆ ఛాన్స్‌ కొట్టేశాడు. మన బలం మీద ముందుకు వెళ్తే ఇంకా బావుంటుంది అంటారు. హను బలం ప్రేమ కథలు. ఈ సినిమా ఆయనకు పెద్ద హిట్‌గా నిలుస్తుంది అనుకుంటున్నాను.

మాతో కూడా లవ్‌స్టోరీలు తీయండి. శర్వా  నాకంటే చిన్నోడు. పార్టీలో కలుస్తుంటాం. కానీ శర్వాగారు అంటాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకీ గౌరవం, స్థాయిని తెచ్చాయి. అందుకే గారు అంటున్నాను. ఈ మధ్యలో టీవీల్లోను, సమాజంలో సినిమా, రాజకీయ నాయకులని కూడా పేర్లు పెట్టి పిలిచేస్తున్నారు. ‘గారు’ అని ఒక గౌరవం ఇవ్వండి. ఒకసారి టీవీలో చూస్తుంటే ఎవరో చిరంజీవిని పిలు అన్నారు. చిరంజీవి ఏంట్రా? చిరంజీవిగారు, పవన్‌ కళ్యాణ్‌గారు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాలి.

వినడానికి  కొంచెం ఆర్టిఫీఫియల్‌గా ఉన్నా మంచి విషయం కాబట్టి అలవాటు చేసుకోండి. ‘గమ్యం’ నుంచి చూస్తున్నాను శర్వాగారిని. మాకు బ్యాగ్రౌండ్‌ ఉంది. నెపోటిజమ్‌కు (బంధుప్రీతి) బ్రాండ్‌ అంబాసిడర్లం (నవ్వుతూ). ఇలాంటి సెల్ఫ్‌ మేడ్‌ హీరోలంటే ఒకలాంటి అడ్మిరేషన్‌ నాకు. మనస్ఫూర్తిగా సినిమా ఆడాలి. అలాగే అదే రోజు విడుదలవుతున్న నా సొంత తమ్ముడు వరుణ్‌ తేజ్‌ ‘అంతరిక్షం’ సినిమా కూడా ఆడాలి’’ అన్నారు.


శర్వానంద్‌ మాట్లాడుతూ – ‘‘హిట్‌ కొట్టనేమో అని టెన్షన్‌ పడకండి. హిట్‌ కొట్టే బాధ్యత నాది. దానికి కారణం ఏంటో చెప్పనా? ఈ మధ్యన ఇండస్ట్రీలో ‘గోల్డెన్‌ హ్యాండ్‌’ అంటున్నారు బన్నీని. మొన్న బన్నీకు ఫోన్‌ చేసి ‘ఇండస్ట్రీలో రెండు హిట్స్‌ విజయ్‌ దేవరకొండకు ఇచ్చారు. నన్ను టచ్‌ చేసి నాకు ఓ హిట్‌ ఇవ్వొచ్చు కదా?’ అని అడిగాను. బన్నీ నాకు ఇన్‌స్పిరేషన్‌. మేమందరం మంచి సినిమాలు చేస్తాం, డిఫరెంట్‌ సినిమాలు చేస్తాం. కానీ బన్నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సినిమాకు వంద కాదు నూట యాభై శాతం శ్రమిస్తాడు.

ఇండస్ట్రీలో మంచి సినిమా వస్తే అది తీసిన టీమ్‌కు ఫస్ట్‌ కాల్‌ బన్నీ నుంచే వెళ్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే హను ఫ్లాప్‌ దర్శకుడు, సాయి పల్లవి, శర్వాకు ఇంతెందుకు ఖర్చు పెట్టారు? అని అడుగుతున్నారు. దానికి కారణం సినిమాలోని కంటెంట్‌. ఈ సినిమా నిర్మాత బ్రదర్‌లా అయిపోయారు నాకు. ఇప్పటి వరకూ ఏ దర్శకుడితో ఈ మాట చెప్పలేదు. హను నాకో గురువు అయిపోయాడు. సాయి పల్లవి చాలా డెడికేటెడ్‌. సంగీతదర్శకుడు విశాల్‌గారి నాన్నగారు పదిరోజుల క్రితం చనిపోయారు.

ఆయినా కానీ సినిమాకు రీరీకార్డింగ్‌ చేశారు. రాసిపెట్టుకోండి.. నన్ను జేకే చూపించినంత అందంగా ఎవ్వరూ చూపించలేరు. 21న వస్తున్నాం. మా తమ్ముడు వరుణ్‌తేజ్‌ ‘అంతరిక్షం’ సినిమా కూడా వస్తోంది. క్రిస్మస్‌ సెలవల్లో మా రెండు సినిమాలు చూసి తెలుగు సినిమాను హిట్‌ చేయండి’’ అన్నారు.‘‘అల్లు అర్జున్‌గారి డ్యాన్స్‌కి నేను పెద్ద అభిమానిని. స్కూల్‌లో కూడా ఆయన పాటలకు డ్యాన్స్‌ చేసేద్దాన్ని. హనుగారికి థ్యాంక్స్‌. నన్ను నమ్మినందుకు. శర్వాగారు గురించి చాలా  మంది హీరోయిన్స్‌ గొప్పగా చెప్పారు. నేనూ అదే చెబుతాను. ఆయన మంచి కో స్టార్‌.

నటిగా నేను ఇంకా ఇంప్రూవ్‌ అవ్వడానికి హెల్ప్‌ చేశారు’’ అన్నారు సాయి పల్లవి. ‘‘ఇది నాకు చాలా స్పెషల్‌ సినిమా. ఈ సినిమాకి ముందు నాకు సక్సెస్‌ లేదు. ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నాను. నన్ను నమ్మారు శర్వానంద్‌. ప్రేమకథ చెప్పడానికి ముఖ్యంగా కావల్సింది సంగీతం, కథ, మంచి నటీనటులు. ఈ మూడు ఈ సినిమాకు బాగా కుదిరాయి. సుధాకర్‌గారికి సినిమాలంటే పిచ్చి. ఒక నిర్మాతకు అంత పిచ్చి ఉండటం ఫస్ట్‌ టైమ్‌ చూస్తున్నాను’’ అన్నారు హను రాఘవపూడి. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు