ఏమై పోతానే.. నువ్వంటూ లేకుంటే!

11 Dec, 2018 03:34 IST|Sakshi
శర్వానంద్‌, సాయిపల్లవి

ప్రాణంగా ప్రేమించే అమ్మాయి హఠాత్తుగా కనిపించకపోతే, వెతికిన జాడ తెలియకపోతే అప్పుడా ప్రేమికుడు విరహంలోకి వెళ్లిపోతాడు. ఇటీవల శర్వానంద్‌ కూడా అలాగే వెళ్లిపోయి.. ‘‘ఏమైపోయావే నీవెంటే నేనుంటే.. ఏమైపోతానే.. నువ్వంటూ లేకుంటే’ అని పాడుకున్నారు. మరి.. ఆయన ప్రేమకథకు ఎలాంటి శుభం కార్డు పడింది? ఇంతకీ.. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానం ఈ నెల 21న విడుదలయ్యే ‘పడిపడిలేచె మనసు’ సినిమాలో తెలుస్తుంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ఆడియో జ్యూక్‌బాక్స్‌ను మార్కెట్‌లోకి నేరుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తెలిపింది. హైదరాబాద్, నేపాల్, కోల్‌కతాల్లోని అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. మురళీ శర్మ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా రామన్‌ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు