ప్యాడ్‌మాన్‌పై నిషేధం!

11 Feb, 2018 08:20 IST|Sakshi
ప్యాడ్‌మాన్‌ అక్షయ్‌ కుమార్‌

కరాచీ : మహిళల సానిటరీ న్యాప్‌కిన్ల ఇబ్బందులే ఇతివృత్తంగా తీసిన ‘ప్యాడ్‌మాన్‌’  చిత్రంపై పాకిస్తాన్‌ బ్యాన్‌ విధించింది. ఆ దేశంలో ఈ చిత్రం విడుదలకు అక్కడి ఫెడరల్‌ సెన్సార్‌ బోర్డు(ఎఫ్‌సీబీ) నో చెప్పింది. ఆర్‌. బల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌లు ముఖ్య పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. 

తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చిత్రాన్ని దిగుమతి చేసుకోమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పలేమని ఎఫ్‌సీబీ మెంబర్‌ ఇషాక్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. అలాగే నిషిద్ద అంశంపై తీసిన ఈచిత్రాన్ని తమ రాష్ట్రంలో విడుదలకు అనుమతించలేమని పంజాబ్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు సైతం వివరించింది. పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఫిల్మ్‌మేకర్‌ సయ్యద్‌ నూర్‌ మాట్లాడుతూ.. ఇతర దేశాల చిత్రాల దిగుమతిపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్యాడ్‌మానే కాదు ముస్లింలను నెగటివ్‌గా చూపించిన పద్మావత్‌ సినిమా సైతం విడుదల కాలేదన్నారు. ఇక అరుణాచలం మురుగనంతం జీవితం ఆధారంగా తెరకెక్కిన ప్యాడ్‌మాన్‌ మూవీ భారత్‌లో మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది.

మరిన్ని వార్తలు