‘పద్మావత్‌’ రిలీజ్ డేట్..!

5 Jan, 2018 12:38 IST|Sakshi

ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన బాలీవుడ్ సినిమా పద్మావతి. చారిత్రక కథగా తెరకెక్కిన ఈ సినిమాలో మహారాణి పద్మావతి పాత్రను అభ్యంతరకరంగా చూపించారని కర్ణిసేన సభ్యులు ఆరోపిస్తున్నారు. షూటింగ్ సమయంలో దాడి దిగిన కర్ణిసేన రిలీజ్ ను అడ్డుకుంటామని హెచ్చరించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా క్లియరెన్స్ రాకపోవటంతో డిసెంబర్ 1న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది.

అయితే ఇటీవల సెన్సార్ బోర్డ్ సినిమాకు కొన్ని మార్పులతో సెన్సార్ సర్టిఫికేట్ ను జారీ చేసేందుకు అంగీకరించింది. చిత్రయూనిట్ కూడా సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసేందుకు సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టైటిల్ ను పద్మావత్‌ గా మార్చాలన్న సూచనకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అంగీకరించినట్టుగా సమాచారం. 

దీంతో  సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయినట్టుగానే భావిస్తున్నారు. ఈ రోజు పద్మావతిగా నటించిన దీపికా పదుకొణే పుట్టిన రోజు కావటంతో సినిమా రిలీజ్ కు సం‍బంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పద్మావత్‌ సినిమాను ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట.

మరిన్ని వార్తలు