పక్కాగా ప్లాన్ చేశారు !

10 Jun, 2016 23:03 IST|Sakshi
పక్కాగా ప్లాన్ చేశారు !

సుభాష్, నాగేష్, భవాని, యువరాణి ప్రధాన పాత్రల్లో రూపొందిన హారర్ చిత్రం ‘పక్కా ప్లానింగ్’. బేబీ దివ్య సమర్పణలో ఏవీ ఫణీశ్వర్ (తుఫాన్) దర్శకత్వంలో నాగేష్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను నిర్మాతలు టి. ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో చాలా చిత్రాలొచ్చాయి. ఈ చిత్రకథాంశం వాటికి భిన్నంగా ఉంటుంది. ఇందులో నటీనటులంతా కొత్తవారే అయినా, అనుభవం ఉన్న వారిలా నటించారు.

నిర్మాత నాగేష్ పక్కా ప్రణాళిక, చిత్ర బృందం హార్డ్ వర్క్‌తో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయగలిగాం. ప్రేమ్ స్వరపరచిన పాటలు ఈ చిత్రానికి హైలైట్’’ అని తెలిపారు. ‘‘త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత, హీరో నాగేష్ సీహెచ్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు ప్రేమ్ ఎల్‌ఎమ్ పాల్గొన్నారు.