పలాస కథ

27 Dec, 2019 00:41 IST|Sakshi
నక్షత్ర, రక్షిత్

మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్‌ కంపెనీలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో ‘పలాస 1978’ చిత్రాన్ని విడుదల చేసేందుకు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు ముందుకొచ్చాయి. పలాసలో జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనాలున్న ఈ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీలకు బాగా నచ్చడంతో గీతా ఆర్ట్స్, యూవీ ప్రొడక్షన్స్‌ పతాకాలపై విడుదల చేయనున్నారు. ‘‘మంచి సినిమాలను అందరికీ చేరువయ్యేలా చూడాలని అల్లు అరవింద్‌గారు భావించడంతో ‘పలాస 1978’ ఈ చిత్రాన్ని జీఏటు యూవీ సంస్థ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం’’ అని బన్నీ వాసు తెలిపారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్‌ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్‌ అరుల్, సంగీతం: రఘు కుంచె. 

మరిన్ని వార్తలు