విభిన్న ప్రయత్నం!

8 Mar, 2015 23:20 IST|Sakshi
విభిన్న ప్రయత్నం!

 అర్చన కథానాయికగా కేవలం ఒకే పాత్రతో రూపొందిన ‘పంచమి’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని సుజాత  బౌరియా దర్శకత్వంలో డి. శ్రీకాంత్ నిర్మించారు. ఆదివారం జరిగిన ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో అర్చన మాట్లాడుతూ -‘‘ఇదొక భిన్నమైన ప్రయత్నం. వాణిజ్య విలువలతో వైవిధ్యమైన కథాంశం నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. దర్శకురాలు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీ రోల్ పోషించాయి’’ అని తెలిపారు. సినిమాకి మంచి స్పందన లభిస్తోందని నిర్మాత అన్నారు. రఘు.ఆర్.బళ్లారి, రావులపల్లి ప్రసాద్, శ్రీకోటి కూడా మాట్లాడారు.
 

>