పక్కా ప్లాన్‌

5 Aug, 2018 05:58 IST|Sakshi
విశాల్‌

ఈ ఏడాది దసరాకు ‘పందెంకోడి 2’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు విశాల్‌. ఇదే స్పీడ్‌లో నెక్ట్స్‌ ఇయర్‌లో ఏ ఏ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో కూడా ఇప్పుడే ఆయన ప్లాన్‌ గీస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. తెలుగు ‘టెంపర్‌’ తమిళ రీమేక్‌లో విశాల్‌ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రాశీఖన్నా కథనాయికగా నటిస్తారు. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తారు. సెట్స్‌పైకి వెళ్లనున్న విశాల్‌ నెక్ట్స్‌ చిత్రమిదేనట. ఈ చిత్రంతో పాటు లక్ష్మణ్‌ డైరెక్షన్‌లో విశాల్‌ ఓ సినిమా చేస్తారని సమాచారం. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ ఒకేసారి జరిగేలా విశాల్‌ పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకున్నారట. ఈ రెంటినీ వచ్చే ఏడాది ఫస్టాఫ్‌లోనే రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేశారట. ఇక 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి ‘పందెంకోడి 2’  సీక్వెల్‌ అని తెలిసిన విషయమే. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

మరిన్ని వార్తలు