పండగకి పందెం

28 Sep, 2018 04:31 IST|Sakshi
విశాల్

విశాల్, మీరాజాస్మిన్‌ జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమా ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2005లో విడుదలైన ఈ సినిమా విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌తో పాటు తెలుగులో మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. ఈ చిత్రం విడుదలైన 12ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా విశాల్‌–లింగుస్వామి కాంబినేషన్‌లో ‘పందెంకోడి 2’ తెరకెక్కుతోంది. ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై తెరకెక్కుతోన్న ‘పందెం కోడి 2’ చిత్రం ట్రైలర్‌ని రేపు (శనివారం) విడుదల చేస్తున్నారు.

‘ఠాగూర్‌’ మధు మాట్లాడుతూ– ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, కెమెరా: కె.ఎ.శక్తివేల్, నిర్మాతలు: విశాల్, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా. 

మరిన్ని వార్తలు