పండుగాడు వస్తున్నాడు

14 Sep, 2019 03:20 IST|Sakshi
అలీ

అలీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ఈ చిత్రంలో రిషిత కథానాయికగా నటించారు. దిలీప్‌ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో హీరో అలీ ఎవరికి ఫోటో తీస్తే వారికి పెళ్లి కుదురుతుంది. ఇదే ప్రధానాంశం. కుటుంబ సమేతంగా చూడదగ్గ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం. చక్కటి పాటలు, ఫైట్స్‌తో అలీ ప్రేక్షకులను అలరిస్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని చిత్రబృందం తెలిపింది. బాబూ మోహన్, వినోద్‌కుమార్, జీవ, సుధ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు యాజమాన్య సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా