పేపర్‌ బాయ్‌ లవ్‌ స్టోరీ

22 Jul, 2018 03:45 IST|Sakshi
సుధాకర్, నరసింహ, జయశంకర్, రియా, సంపత్‌ నంది, సంతోష్‌ శోభన్‌

‘‘ఒక అమ్మాయి, ఓ పేపర్‌ బాయ్‌ మధ్య జరిగే ప్రేమ కథే ‘పేపర్‌ బాయ్‌’. ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. మంచి సబ్జెక్ట్‌ ఉన్న సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. కెమెరామెన్‌ సౌందర్య రాజన్‌ మంచి విజువల్స్‌ అందించారు. భీమ్స్‌ మ్యూజిక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత సంపత్‌ నంది అన్నారు. సంతోష్‌ శోభన్‌ హీరోగా, రియా, తాన్య హోప్‌ హీరోయిన్లుగా జయశంకర్‌ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పేపర్‌ బాయ్‌’. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లో ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్‌ఎన్‌ సినిమాపై సంపత్‌ నంది నిర్మించారు.

ఈ సినిమా టీజర్‌ను రియల్‌ పేపర్‌ బాయ్‌ అఖిల్‌ చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయశంకర్‌ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన షార్ట్‌ ఫిల్మ్‌ చూసి సంపత్‌గారు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. సింపుల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘గోల్కొండ హైస్కూల్‌’తో బాల్య నటుడిగా నన్ను ఆదరించారు. ఇప్పుడు ‘పేపర్‌ బాయ్‌’గా మీ ముందుకు వస్తున్నా, ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ కొత్తవారే’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. నిర్మాత నరసింహ, కథానాయిక రియా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మురళి మామిళ్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు