మెగా ప్రొడ్యూసర్‌ చేతికి ‘పేపర్‌ బాయ్‌’

26 Aug, 2018 13:29 IST|Sakshi

మాస్‌ డైరెక్టర్‌గా సక్సెస్‌ సాధించిన సంపత్‌ నంది చిన్న సినిమాలకు కథను అందిస్తూ, నిర్మిస్తూ సక్సెస్‌ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు.  తాజాగా ఈ డైరెక్టర్‌ అందించిన కథ, కథనాలతో తెరకెక్కిన సినిమా ‘పేపర్‌ బాయ్‌’. ఈ సినిమా ట్రైలర్‌తో బాగానే పాపులర్‌ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఆసక్తికరంగా మారింది. 

ఇలాంటి చిన్న సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించడం మంచి పరిణామం. పైగా చిత్రయూనిట్‌ కూడా సినిమాకు వినూత్న రీతిలో ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గీత ఆర్ట్స్‌ చేతిలోకి వెళ్లింది. అల్లు అరవింద్‌ లాంటి పెద్ద నిర్మాత చేతిలో సినిమా పడితే.. సినిమాకు ఓపెనింగ్స్‌ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఇక సినిమా కంటెంట్‌ ప్రేక్షకులకు నచ్చితే మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు