నవ్వు కోసం పరుగు

19 Mar, 2019 00:49 IST|Sakshi
సాయి శివాజీ, యోగేశ్వర్, సుమన్, వీవీ గిరి

యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పరారి’. ‘రన్‌ ఫర్‌ ఫన్‌ ’ అనేది ఉపశీర్షిక. గాలి ప్రత్యూష సమర్పణలో శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై గాలి వి.వి.గిరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని నిర్మాత సి.కల్యాణ్‌ రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ– ‘‘యోగేశ్వర్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగిన కథని ఎంచుకున్నాడు. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్‌ లేకుండా చాలా ఈజ్‌తో నటించాడు. సాయి శివాజీ డ్యాన్స్‌   మాస్టర్‌గా నాకు పరిచయం. మంచికథను ఎంచుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు’’ అన్నారు.

నటుడు సుమన్‌ మాట్లాడుతూ– ‘‘గిరి చాలా సంవత్సరాలుగా నా అభిమాని. వారి అబ్బాయితో ఓ సినిమా చేయాలని అంటుంటే నేనే వాయిదా వేస్తూ వచ్చాను. కానీ, ఆయనలో పట్టుదల చూసి మంచి కథను ఎన్నుకుని ఈ చిత్రం చేశాం. ఇందులో నేనూ ఒక ముఖ్య పాత్ర పోషించాను’’ అన్నారు. ‘‘పరారి’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌తో పాటు విదేశాల్లో జరిగింది. ఒక పాట మినహా సినిమా పూర్తయింది’’ అన్నారు వి.వి. గిరి. ‘‘హీరోగా నాకు తొలి చిత్రమైనా సహ నటుల నుంచి ఎంతో నేర్చుకున్నా. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు యోగేశ్వర్‌. ‘‘వినోదానికి ప్రాధాన్యతనిస్తూ థ్రిల్లింగ్‌ అంశాలతో తెరకెక్కిస్తోన్న చిత్రమిది’’ అన్నారు సాయి శివాజీ. సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్, నటులు శ్రవణ్, గౌతమ్‌రాజు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అంజి.
 

మరిన్ని వార్తలు