పరిణీతి చిర్రుబుర్రు

13 Aug, 2014 00:03 IST|Sakshi
పరిణీతి చిర్రుబుర్రు

మీడియా సమావేశంలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించిన రిపోర్టర్‌పై పరిణీతి చోప్రా చిర్రుబుర్రులాడింది. అతడిని తిట్టిపోసి,  బయటకు వెళ్లిపోవాలంటూ సమావేశం నుంచి పంపేసింది. ఆ తర్వాత కోపాన్ని అదుపు చేసుకుని, మీడియా సమావేశాన్ని యథావిధిగా కొనసాగించింది.
 
 జర్నలిస్టుగా కరిష్మా
కొద్దికాలంగా తెరమరుగైన కరిష్మా కపూర్ తిరిగి తెరపైకి వచ్చేందుకు ముమ్మర యత్నాలే సాగిస్తోంది. ఈ యత్నాలు ఫలించి, బుల్లితెరపై జర్నలిస్టు పాత్ర పోషించే అవకాశం ఆమెకు లభించింది. ఒక మహిళా జర్నలిస్టు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సీరియల్‌లో కరిష్మా ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం.
 
 ‘మగధీర’గా షాహిద్!
 రామ్‌చరణ్ తేజ హీరోగా నటించిన ‘మగధీర’ను సాజిద్ నడియాద్‌వాలా హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. దీని హక్కుల కోసం సాజిద్ టాలీవుడ్ వర్గాలతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి