శ్రద్ధా కపూర్‌ ఔట్‌.. పరిణితీ ఇన్‌

15 Mar, 2019 20:48 IST|Sakshi

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’..  విభిన్న చిత్రాల దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్, సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైనా బయోపిక్ కోసం కొంత కాలం గ్రౌండ్ వర్క్‌ చేసిన శ్రద్ధాకపూర్... బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. లుక్స్ పరంగా కూడా సైనా నెహ్వాల్‌కు దగ్గరగా ఉండే శ్రద్ధాకపూర్... స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందనే క్యూరియాసిటీ కూడా జనాల్లో పెరిగిపోయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం సైనా బయోపిక్ నుంచి శ్రద్ధ తప్పుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో శ్రద్ధకు డెంగ్యూ జ్వరం సోకండంతో గతేడాది సెప్టెంబర్‌ నుంచి షూటింగ్‌లో పాల్గొనటం లేదు. ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న ఉన్న శ్రద్దకు ‘సైనా’చిత్రానికి డేట్స్‌ కుదరటం లేదు. దీంతో తన కారణంగా ఈ సినిమా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నుంచి శ్రద్ద తప్పుకున్నారు. అయితే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ 2020లో విడుదల చేయాలనుకుంటున్న చిత్ర బృందం.. శ్రద్ద స్థానంలో మరో హీరోయిన్‌ పరిణీతి చోప్రాను తీసుకున్నారు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్స్ 3D’, ‘భాగి 3’ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా