వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

29 Oct, 2019 14:35 IST|Sakshi

‘వాళ్లే నా ఆత్మబంధువులు. నా స్నేహితులు. నా పిల్లలు. నా సర్వస్వం’ అంటూ బాలీవుడ్‌ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా తన సోదరులపై ఉన్న ప్రేమ చాటుకున్నారు. తన కంటే చిన్నవాళ్లే అయినా వారెంతో పరిణతితో ఆలోచిస్తూ తనకు సలహాలు, సూచనలు ఇస్తుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం.. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌తో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ భాయ్‌ దూజ్ వేడుక(భగినీ హస్త భోజనం)లో తన తమ్ముళ్లు సహజ్‌, శివాంగ్‌తో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా తన తమ్ముళ్లతో కలిసి దిగిన ఫొటోను పరిణీతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 

నాలాగా ఉండమని చెబుతాను..
బాయ్‌ దూజ్‌ సందర్భంగా పరిణీతి మాట్లాడుతూ.. ‘నాకంటే చిన్నవాళ్లు అయినంత మాత్రాన నేను వాళ్లను గారాబం చేయను. నిజం చెప్పాలంటే వాళ్లే నాపై ఎక్కువ ప్రేమ కురిపిస్తారు. నాకు వాళ్లంటే ఎంతో ఇష్టం. నా జీవితం గురించిన మొత్తం విషయాలు వాళ్లకు తెలుసు. మా మధ్య దాపరికాలు ఉండవు. నాకు ప్రతీ విషయంలోనూ సలహాలు ఇస్తారు. నాకంటే గొప్పగా ఆలోచిస్తారు. ఒకవేళ నేను వాళ్లకు ఏదైనా చెప్పాల్సి వస్తే నాలాగే సంతోషంగా ఉండమని చెబుతాను. ఎన్ని బాధలు ఉన్నా.. కఠిన పరిస్థితులు ఎదురైనా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమానాన్ని ఎంజాయ్‌ చేయమని మాత్రమే సలహా ఇస్తాను అని పేర్కొన్నారు. అదే విధంగా వేసవి కాలం సెలవుల్లో కెన్యాలో ఉండే తమ బామ్మ వాళ్ల ఇంటికి వెళ్లడం తమకు ఉన్న మధుర ఙ్ఞాపకాలు అని.. అక్కడ పార్కుల్లో తిరుగుతూ అందరం తెగ సందడి చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కాగా సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో ఒత్తిడి తట్టుకోలేక తాను డిప్రెషన్‌కు గురైనట్టు పరిణీతి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు.

The loves of my life! #HappyRakhi ❤️❤️❤️ @thisissahajchopra @shivangchopra99

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా