పార్తిబన్ గురునమస్కారం!

12 Dec, 2016 14:39 IST|Sakshi
పార్తిబన్ గురునమస్కారం!

నానాటికీ విలువలు పడిపోతున్న ఈ రోజుల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్న పదాలకు అర్థాలు మారిపోతున్న ఈ తరంలో దర్శక నటుడు పార్తిబన్ ఒక బృహత్తర కార్యాన్ని ఆదివారం నిర్వహించారు. గురు నమస్కారం పేరుతో తనకు దర్శకత్వంలో ఓనమాలు నేర్పించిన గురువు దర్శకుడు కే. భాగ్యరాజ్‌కు ఘన సత్కారాన్ని నిర్వహించారు.ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోడిట్ట ఇడంగళై నిరప్పుగా. ఇందులో తన గురువు భాగ్యరాజ్ కొడుకు శాంతనను ీహ రోగా ఎంపిక చేసుకున్నారు. కే.సత్య సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం స్థానిక అడయారులోని ఇమేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు.

అందులో భాగంగా తన గురువు కే.భాగ్యరాజ్‌కు గరునమస్కారం పేరుతో ఘన సన్మానం చేశారు. ఇదే వేదికపై దర్శకుడు పాండియరాజన్ సహా కే.భాగ్యరాజ్ శిష్యులందరూ కలిసి మరుప్పేనా(మరచిపోగలనా) పేరుతో జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్ర దర్శకుడు పార్తిబన్ మాట్లాడుతూ తన గురువుకు ఆ సత్కారంతో పాటు మరో కానుక కూడా ఉందన్నారు. తాను నిర్మించనున్న చిత్రానికి తన గురువు కే.భాగ్యరాజ్ దర్శకత్వం వహించనుండడమే ఆ కానుక అని పేర్కొన్నారు. చెప్పడమే కాదు అందుకు అడ్వాన్‌‌సను కూడా అందించారు.

ఆ చిత్రంలో కథానాయకుడుగా ఈయన వారసుడు శాంతనునే నటిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగ్యరాజ్ గురువు భారతీతాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎస్‌పీ.ముత్తురామన్, కేఎస్.రవికుమార్, శంకర్, గాయకుడు ఎస్‌పీ.బాలసుబ్రహ్మణ్యం, నటుడు శివకుమార్, ప్రభు, ఎం.విశాల్, కార్తీ, నటి సుహాసిని, రోహిణి, సుకన్య, లిజీ, ఏవీఎం.శరవణన్, కలైపులి ఎస్.థాను, ఎస్‌వీ.శేఖర్, లింగుస్వామి అతిథులుగా పాల్గొన్నారు.