కరోనా బాధితులకు పవన్ కల్యాణ్‌ విరాళం

26 Mar, 2020 09:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ కరోనా వైరస్‌ బాధితులకు అండగా నిలిచారు. వైరస్‌ బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ) ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున సహాయం చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రుల సహాయ నిధికి అందచేస్తున్నట్లు పవన్ కల్యాణ్‌ తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయాలను విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్‌ ధాటికి సామాన్య ప్రజలతో పాటు అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో వారిని ఆదుకునేందుకు ఎంపీలతో సహా, పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. (వైద్యులు తెల్లకోటు దేవుళ్లు)

ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తమ వంతు సాయం అందించడానికి వైఎస్సార్‌సీపీ ఎంపీలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా తమ రెండు నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక నెల జీతాన్ని ప్రధాని సహాయ నిధికి, మరో నెల జీతాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి  విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. (వైఎస్సార్‌సీపీ ఎంపీల విరాళం)

మరిన్ని వార్తలు