గెస్ట్ రోల్లో పవన్ కళ్యాణ్!

27 Dec, 2014 10:27 IST|Sakshi
గెస్ట్ రోల్లో పవన్ కళ్యాణ్!

అక్కినేని కుటుంబం నుంచి వస్తున్న మరో నట వారసుడి అఖిల్ తొలి చిత్రంపై టాలీవుడ్లో రోజుకో హాట్ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు యంగ్ హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరించడం ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అఖిల్ ఎంట్రీ గ్రాండ్గా ఉండేందుకు దర్శక నిర్మాతలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

దాంతో తనయుడి చిత్రంలో తండ్రి అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నాడట. అయితే గెస్ట్ రోల్స్పై  దర్శక నిర్మాతలు మాత్రం పెదవి విప్పటం లేదు. మరోవైపు ఈచిత్రాన్ని ...  సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకు ఎక్కించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ...అఖిల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఇటీవలే ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు అఖిల్ సరసన నటించే హీరోయిన్గా నటించేది ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.