సంగారెడ్డిలో ‘కాటమరాయుడు’ సందడి

25 Jan, 2017 09:56 IST|Sakshi
సంగారెడ్డిలో ‘కాటమరాయుడు’ సందడి

దుర్గామాత సన్నిధిలో హీరో పవన్‌కల్యాణ్‌పై సన్నివేశం  చిత్రీకరణ
షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్‌ తదితరులు


సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటలోని సప్త ప్రాకారయుత దుర్గాభవానీ మాత ఆలయంలో ‘కాటమ రాయుడు’ సందడి చేశారు. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో పవన్‌ కల్యాణ్, శ్రుతి హాసన్‌ జంటగా కాటమ రాయుడు చిత్రాన్ని దర్శకుడు కిశోర్‌ కుమార్‌ పార్థసాని (డాలీ) తెరకెక్కిస్తున్నారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చిత్రంలో జాతరకు సంబంధించిన సన్నివేశాలను స్థానిక దుర్గా మాత ఆలయంలో మంగళవారం చిత్రీకరించారు. ప్రతి నాయకుడు అజయ్, సహ నటులు నాజర్, అలీ, పృథ్వీరాజ్, కమల్‌ కామరాజు,  నందిత, రజిత తదితర ప్రధాన తారాగణం ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. సినిమాటోగ్రాఫర్‌ ప్రసాద్‌ మురెళ్ల సన్నివేశాలను  కెమెరాలో బంధించారు.  నిర్మాత శరత్‌ మరార్‌ మాట్లాడుతూ.. షూటింగ్‌ డెబ్బై శాతం పూర్తయిందన్నారు.  ఈ సందర్భంగా తనను చూసేందుకు వచ్చిన అభిమానులతో పవన్‌ కల్యాణ్‌  షేక్‌హ్యాండ్‌ ఇచ్చి  సెల్ఫీలు కూడా దిగారు. అంతకుముందు దేవాలయంలో హీరోయిన్‌ శ్రుతి హాసన్‌తో కలిసి పవన్‌ కల్యాణ్‌ పూజలు చేశారు.