కొత్త సినిమా ప్రస్థానం

13 Mar, 2020 05:30 IST|Sakshi
సాయితేజ్‌, నివేదా పేతురాజ్‌

‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్నారు సాయితేజ్‌. ప్రస్తుతం ‘ప్రస్థానం’ చిత్రదర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో తన నూతన చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. నివేదా పేతురాజ్‌ హీరోయిన్‌. జగపతిబాబు పవర్‌ఫుల్‌ రోల్‌ చేయనున్నారు. జె.భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుకలో నిర్మాత  అల్లు అరవింద్‌  కెమెరా స్విచ్చాన్‌ చేసి, స్క్రిప్ట్‌ అందించగా, నటుడు పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు వంశీ పైడిపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దేవ కట్టా మాట్లాడుతూ– ‘‘ఎగ్జయిట్‌మెంట్‌ కలిగించే అద్భుతమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఏప్రిల్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: శ్యామ్‌ దత్‌.

మరిన్ని వార్తలు