నా తల్లికి న్యాయం జరిగే వరకు కదలను : పవన్‌

20 Apr, 2018 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సినీ పెద్దలు, కుటుంబ సభ్యులతో ఫిల్మ్‌ ఛాంబర్‌లో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌ ‘మా’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న కుట్రపై స్పందించాలని లేకపోతే దీక్షకు దిగుతానని పవన్‌ వారితో హెచ్చరించినట్లు సమాచారం. ‘కుట్ర వెనకాల ఉంది ఎవరో చెప్పాను. వారిపై చర్యలు తీసుకోవాలి. ‘మా’ చర్యలు చేపడతుందా? లేదా నేనే కార్యాచరణకు దిగలా? నా తల్లికి న్యాయం జరిగే వరకు ఛాంబర్‌ విడిచిపోను’ అని పవన్‌ వారితో ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఛాంబర్‌ రెండు వైపులా తలుపులు వేసుకుని లోపల కూర్చున్న పవన్‌.. నిరసన కొనసాగిస్తూనే చర్చలు కొనసాగిస్తున్నారు.

ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
ఫిల్మ్‌ ఛాంబర్‌లో పవన్‌ కల్యాణ్‌.. మెగా ఫ్యామిలీ, కొందరు సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్‌కు మద్ధతు తెలపటానికి వచ్చిన ఫ్యాన్స్‌ ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. మరోవైపు పవన్‌ ఫ్యాన్స్‌ ‘ఎల్లో మీడియా డౌన్‌ డౌన్‌.. లోకేశ్‌ పప్పు నినాదాలతో’ ఆ ప్రాంతమంతా హోరెత్తించారు.

సినీ ప్రముఖులంతా ఒక్కోక్కరుగా పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు ఛాంబర్‌కు చేరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లతోపాటు అల్లు అరవింద్‌, దర్శకుడు వీవీ వినాయక్‌, జీవి, రమేశ్‌ మెహర్‌, మా సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో మెగాస్టార్‌ చిరంజీవి కూడా రావొచ్చని సంకేతాలు అందుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌కు సినీ రంగం బాసటగా నిలుస్తోంది. పూరీ జగన్నాథ్‌ ఇప్పటికే ట్వీట్‌ చేయగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత కేఎస్‌ రామారావు స్పందించారు. వర్మను ఓ వేస్ట్‌ ఫెలో అంటూ అభివర్ణించిన ఆయన.. మెగా ఫ్యామిలీకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

మరిన్ని వార్తలు