చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

9 Apr, 2020 14:33 IST|Sakshi

హీరో మెగాస్టార్‌ చిరంజీవి ఆంజనేయస్వామి వీరభక్తుడనే సంగతి తెలిసిందే. బుధవారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఆంజనేయస్వామితో తనకు చాలా అనుబంధం ఉందని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన కొన్ని పోస్ట్‌లు కూడా చేశారు. ‘1962 లో నాకు  ఓ లాటరీలో ఈ బొమ్మ వచ్చింది.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది.. ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి అని అన్నారు’ అని చిరు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు తనకు లాటరీలో వచ్చిన ఫొటోను కూడా చిరు పోస్ట్‌ చేశారు.

ఆ ట్వీట్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. తాజాగా ఆ ట్వీట్‌పై చిరంజీవి సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఆ ఫొటోకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘మా అన్నయ్య చిరంజీవితో మా ఇంట్లో ఆంజనేయస్వామిని పూజించడం ప్రారంభమైంది. అది కమ్యూనిస్టు, నాస్థికుడైన మా నాన్నను రామ భక్తునిగా మార్చింది. నా టీజేజ్‌లో కొన్ని సందర్భాల్లో హనుమాన్‌ చాలీసా 108 సార్లు పఠించేవాడిని. జై హనుమాన్‌’ అని ట్వీట్‌ చేశారు. 

చదవండి : ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకం: చిరంజీవి 

మరిన్ని వార్తలు