పవన్ కు సర్‌ ప్రైజింగ్ గిఫ్ట్!

1 Mar, 2017 09:02 IST|Sakshi
పవన్ కు సర్‌ ప్రైజింగ్ గిఫ్ట్!

హీరో పవన్ కళ్యాణ్ కు నటుడు శివబాలాజీ ఊహించని కానుక ఇచ్చాడు. కాటమరాయుడు సినిమా షూటింగ్ లో పవన్ కు సర్‌ ప్రైజింగ్ గిఫ్ట్ అందించాడు. స్కార్ఫ్ లో చుట్టి తీసుకొచ్చిన కానుకను మోకాళ్లపై కూర్చుకుని పవన్ కు ప్రేమపూర్వకంగా అందించాడు. చిరునవ్వుతో అందుకున్న పవర్ స్టార్ దాన్ని ఓపెన్ చేయగానే అందులో బంగారపు రంగులో ఉన్న కత్తి ఉంది. పవన్ కళ్యాణ్ దాన్ని ఆసక్తిగా తిలకించారు. కత్తిపై రెండు వైపుల జనసేన పేరు తెలుగు, హిందీ భాషల్లో రాసుంది. ‘పవిత్రాయ సాధునాం... ’ అనే శ్లోకం కూడా కత్తిపై రెండు వైపులా లిఖించారు. కత్తి పిడి దగ్గర జనసేన లోగోను పొందుపరిచారు. శివబాలాజీ ఇచ్చిన కానుకను  కాటమరాయుడు బృందంలోని వారంతా ఆసక్తిగా తిలకించారు.

తమిళ చిత్రం ‘వీరమ్‌’కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ‘కాటమరాయుడు’లో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. నలుగురు తమ్ముళ్లలో ఒకడిగా శివబాలాజీ నటిస్తున్నాడు. కమల్‌కామరాజ్, చైతన్యకృష్ణ, అజయ్ తమ్ముళ్ల పాత్రలు పోషిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు కిషోర్‌ పార్ధసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు. మార్చి నెలాఖరుకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)