పవర్‌స్టార్ వారసుడు వచ్చేస్తున్నాడు!

2 Sep, 2014 23:13 IST|Sakshi
పవర్‌స్టార్ వారసుడు వచ్చేస్తున్నాడు!

 పవర్‌స్టార్ తనయుడు అకిరా నందన్ త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడు. ఇది నిజంగా పవన్‌కల్యాణ్ అభిమానులకు శుభవార్తే. ఈ విషయాన్ని పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఆమె మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలి సిందే.
 
 ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాత్రలో అకిరానందన్ కనిపిస్తాడు. ‘‘అకిరా నందన్... నా ‘ఇష్క్ వాలా లవ్’లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా నా తనయుడు నటునిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ సినిమా ప్రచార చిత్రాలను కూడా ఇటీవల విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను అనువదించనున్నట్లు గతంలో రేణూ దేశాయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే... త్వరలోనే పవర్ వారసుణ్ణి తెరపై చూడొచ్చన్నమాట.