కిర్రాక్‌గా పవన్‌ 'వకీల్‌ సాబ్‌' ఫస్ట్‌ లుక్‌

2 Mar, 2020 18:21 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వకీల్‌ సాబ్‌' చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్‌ చిత్రం 'పింక్‌' రీమేక్‌తో పవర్‌ స్టార్‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్‌ను వకీల్ సాబ్‌గా ఖరారు చేయగా.. ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. టైటిల్‌ని ధృవీకరిస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. చదవండి: హీరోయిన్‌ను ముంబై రమ్మన్న అజ్ఞాత వ్యక్తి!

'ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ.. కుర్చీలో కూర్చోని ఉండటం' ఫస్ట్ లుక్‌లో కనబడుతోంది. కాగా.. ఇది పవన్‌ కల్యాణ్‌ నటించిన 26వ చిత్రం. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.  చదవండి: రాహుల్‌ పెద్ద హీరో కావాలి : గోపిచంద్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా