శంకర్‌ సినిమాలో పాయల్‌కు అవకాశం?

30 May, 2020 15:05 IST|Sakshi

ఆర్‌ఎక్స్‌-100తో కుర్రకారు మనసు దోచుకున్న నటి పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి సినిమాతోనే ఫుల్‌ క్రేజ్‌ సాధించిన ఈ నటికి ఊహించిన విధంగా ఆఫర్లు రావడం లేదు. వెంకీ మామ, డిస్కో రాజా వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కెరీర్‌ పరంగా ఆమెకు ఏ మాత్రం ప్లస్‌ కాలేదు. అయితే ఈ అమ్మడికి ఊహించని అవకాశం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. సౌతిండియా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో పాయల్‌కు నటించే అవకాశం వచ్చిందని సమాచారం. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ‘ఇండియన్‌ 2’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. (చదువులో నేను టాపర్‌: సమంత)

ఈ చిత్రంలో కాజల్, రకుల్‌ ప్రీత్‌ సింగ్, సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడీ చిత్రంలో ప్రత్యేక గీతం కోసం పాయల్‌ను చిత్ర బృందం సంప్రదించిందని టాక్‌. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్‌కు అవకాశం వస్తే పెద్ద బ్రేక్‌ దొరికినట్లేనని, శంకర్‌ సినిమాలో కనిపిస్తే అటు నార్త్‌ ఇటు సౌత్‌లో ఫుల్‌ క్రేజ్‌ పెరుగుతుందని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. (తండ్రి అయిన దర్శకుడు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా