స్పెషల్‌ పాయల్‌

1 Jun, 2020 01:10 IST|Sakshi
పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఆర్‌ఎక్స్‌ 100’లో తన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపారు హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌. గత ఏడాది ‘సీత’ చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. తాజాగా మరో స్పెషల్‌ సాంగ్‌లో నర్తించడానికి రెడీ అవుతున్నారని టాక్‌. కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కమల్, శంకర్‌ కాంబినేషన్‌లోనే 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్‌. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులోని ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం పాయల్‌ రాజ్‌పుత్‌ను సంప్రదించారట ‘ఇండియన్‌ 2’ చిత్రబృందం. పాయల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియాభవానీ శంకర్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు