ఆస్కార్‌ 

19 Dec, 2018 00:05 IST|Sakshi

బరిలో ‘పీరియడ్‌’

భారతదేశం నుండి వెళ్లిన ‘పీరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’.. చిత్రం ‘లఘు కథాంశ చిత్రాల’ కేటగిరీ కింద ఆస్కార్‌ నామినేషన్‌ దక్కించుకుంది! అవార్డు చిత్రాల దర్శకుడు రేకా చటాబ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రుతుస్రావాన్ని కథాంశంగా తీసుకుని గ్రామీణ నేపథ్యంలో సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ఈ ఏడాది ‘క్లీవ్‌లాండ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్‌’్ట అవార్డ్‌ పొందింది. లాస్‌ ఏంజెలిస్‌ లోని ఓక్‌ఉడ్‌ స్కూల్‌ విద్యార్థులు తమ క్లాస్‌ టీచర్‌ మెలిస్సా బెర్టన్‌ నేతృత్వంలో చేపట్టిన ‘ది ప్యాడ్‌ ప్రాజెక్ట్‌’లో భాగంగా ‘పీరియడ్‌.

ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’ రూపుదాల్చింది. చిత్రంలో.. ఢిల్లీ సమీపంలోని హపూర్‌ గ్రామంలో కొంతమంది మహిళలు రుతుస్రావం చుట్టూ ఉన్న దురభిప్రాయాలు, దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. ‘ఫ్లయ్‌’ అనే బ్రాండ్‌ నేమ్‌తో తామే సొంతంగా శానిటరీ ప్యాడ్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. స్ఫూర్తిదాయకమైన ఈ చిత్రంతో పాటు.. ‘బ్లాక్‌ షీప్‌’, ‘ఎండ్‌ గేమ్‌’, ‘లైఫ్‌బోట్‌’, ‘లాస్‌ కమాండోస్‌’, ‘మై డెడ్‌ డాడ్స్‌ పోర్నో టేప్స్‌’, ‘ఎ నైట్‌ ఎట్‌ ది గార్డెన్‌’, ‘63 బాయ్‌కాట్‌’, ‘ఉమెన్‌ ఆఫ్‌ ది గులాగ్, ‘జియాన్‌’ చిత్రాలు కూడా ఈ కేటగిరీ కింద నామినేషన్‌కు నిలబడ్డాయి. 
 

>
మరిన్ని వార్తలు