ప్లే బ్యాక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది

7 Dec, 2019 05:40 IST|Sakshi
సుకుమార్‌, హరి ప్రసాద్‌ జక్కా

– సుకుమార్‌

దినేష్‌ తేజ్, అనన్య జంటగా హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో పెద్దినేని కవిత సమర్పణలో పెద్దినేని ప్రసాద్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్లేబ్యాక్‌’. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసిన దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘నేను చేయాలనుకున్న కథ ఈ ‘ప్లేబ్యాక్‌’. విభిన్నమైన కథ. హరిప్రసాద్‌కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. చిన్న సినిమాలు ఆడుతున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘నేను, సుకుమార్‌ పాతికేళ్లుగా స్నేహితులం. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశాం.

కెమెరామేన్‌ బుజ్జి ఇందుకు కారణం. హీరో దినేష్‌ చాలా కష్టపడి చేశాడు’’ అన్నారు హరిప్రసాద్‌. ‘‘నా కెరీర్‌లో ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దినే‹ష్‌. ‘‘డైరెక్టర్‌ రాసుకున్న థ్రిల్లింగ్‌ పాయింట్‌ను కెమెరామేన్‌ బుజ్జి అందంగా చూపించారు. అర్జున్‌ కల్యాణ్, స్పందన, ఐశ్వర్య బాగా నటించారు’’ అన్నారు నిర్మాత డీజే రాజు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు అర్జున్‌ కల్యాణ్‌.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా