రేప్ కేసులో బాలీవుడ్ సింగర్ అరెస్ట్!

8 May, 2014 16:18 IST|Sakshi
రేప్ కేసులో బాలీవుడ్ సింగర్ అరెస్ట్!
ముంబై: ఆషికీ-2 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ రేప్ కేసులో అరెస్టయ్యాడు. 28 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై అంకిత్ తివారీ ఆయన సోదరుడు అంకుర్ తివారీ లను వెర్సోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అకింత్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆయన సోదరుడు తనను చంపుతానని బెదిరించారని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో అంకిత్, అంకుర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
గత కొద్దికాలంగా పెళ్లి చేసుకుంటానని చెబుతూ ఓ మహిళను నమ్మించి.. ప్రస్తుతం అంకిత్ మనసు మార్చకున్నట్టు ముంబైకి చెందిన ఓ దిన పత్రిక కథనంలో వెల్లడించింది. తన స్నేహితురాలితో అంకిత్ తో పరిచయమైందని, అప్పటి నుంచి తనతో అంకిత్ క్లోజ్ గా ఉంటున్నారని బాధితురాలు తెలిపారు.