దియా జలావొ: ‘దీపావళి అనుకున్నారేంటి?’

6 Apr, 2020 13:14 IST|Sakshi
సోనమ్‌ కపూర్‌

కరోనా చీకట్లను తరిమికొట్టేందుకు, జాతి ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘దియ జలావో’ దిగ్విజయంగా పూర్తయింది. ఆదివారం యావద్దేశం విశేషంగా స్పందించింది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దీపాలు వెలిగించి తమ మద్దతు తెలిపారు. అయితే నిన్న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కొంతమంది దీపాలు వెలిగించడానికి బదులు టపాసులు పేల్చటంపై అన్ని వర్గాలనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టపాసులు కాల్చడంపై బాలీవుడ్‌ తారలు సోనమ్‌ కపూర్‌, తాప్సీ పన్ను, రిచా చద్దాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా వారు స్పందించారు. ‘‘ రాంగ్‌ మెమో’ అనే శీర్షికతో తాప్సీ ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘’ కొంతమంది దీన్ని జాతర అనుకుంటున్నారు’’ అని ట్వీట్‌ చేశారు.

 ‘‘ కొంతమంది టపాసులు కాలుస్తున్నారు. కుక్కలు బయట అరుస్తున్నాయి. ఇదేమన్నా దీపావళి అనుకుంటున్నారా?.. నాకంతా  తికమకగా ఉంది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉండింది. కొంతమంది మూర్ఖులు టపాసులు కాల్చడం వల్ల దక్షిణ ఢిల్లీలో.. పక్షులు, కుక్కలు, సైరన్ల మోత మోగుతోంద’’ ని మండి పడ్డారు సోనమ్‌ కపూర్‌. 

‘‘ టపాసులు ఎందుకు కాలుస్తున్నార’’ని రిచా చద్దా ప్రశ్నించారు.
 

>
మరిన్ని వార్తలు