సుశాంత్ ఫోటోలు షేర్‌.. పోలీసుల వార్నింగ్‌

15 Jun, 2020 12:17 IST|Sakshi

ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతదేహం ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్న వారికి మహారాష్ట్ర పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ డెడ్ బాడీ ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దని, అలా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఒక వేళ ముందే షేర్ చేసి ఉంటే వాటిని డిలీట్ చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో మృతదేహం ఫోటోలను వైరల్‌ చేయడం గమనించామని, కోర్టు ఆదేశాలననుసరించి, చట్టంలోని మార్గదర్శకాల ప్రకారం ఇలా చేయడం నేరం అని పోలీసులు పేర్కొన్నారు. (సుశాంత్‌ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ)

కాగా.. కొంత మంది అభిమానులు సైతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ అభిమానిని అలాంటి స్థితిలో తాము చూడలేకపోతున్నామని, ఆ ఫోటోలను షేర్ చేయవద్దని కోరుతున్నారు. నటుడు సోనూసూద్ సైతం నెటిజన్లకు ట్విటర్‌లో ఇదే విషయాన్ని తెలియజేశారు. సుశాంత్ డెడ్ బాడీ ఫోటోలు షేర్ చేయొద్దని కోరారు. (సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్యే: ధ్రు‌వీక‌రించిన వైద్యులు)

ఇదిలా ఉండగా.. ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలియాల్సి ఉంది. సుశాంత్ సింగ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కి గురైంది.(కలలు కరువయ్యాయా?)

మరిన్ని వార్తలు