షూట్‌ షురూ

8 Nov, 2019 03:34 IST|Sakshi
మణిరత్నం

రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఆయన షూట్‌ ప్లాన్‌ను రెడీ చేశారని కోలీవుడ్‌ సమాచారం. తొలి షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్‌ చేశారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కొన్ని సన్నివేశాలకు సంబంధించి థాయ్‌ల్యాండ్‌ అడవుల్లో సెట్‌ వర్క్‌ జరుగుతోందట.

మరిన్ని సన్నివేశాల కోసం నటీనటుల కంటే ముందే మణిరత్నం అక్కడికి వెళ్లి మరికొన్ని లొకేషన్స్‌ను ఫైనలైజ్‌ చేస్తారని కోలీవుడ్‌ టాక్‌. అంతా పూర్తి చేసి చిత్రీకరణను వచ్చే నెల 12న మొదలుపెట్టాలని భావిస్తున్నారట. మరోవైపు ఈ సినిమాలో నటించే నటీనటులపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇందులో నటింబోతున్నట్లు ఇప్పటివరకు విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్‌లు మాత్రమే వివిధ సందర్భాల్లో చెప్పారు. ఐశ్వర్యా రాయ్‌ రెండు పాత్రల్లో కనిపిస్తారట. ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో ఇంకా ‘జయం’ రవి, అనుష్క, అమలాపాల్, కీర్తీ సురేష్, పార్తీబన్‌ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు