‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

15 Jul, 2019 17:58 IST|Sakshi

న్యూఢిల్లీ : తన చిరకాల స్నేహితుడు, నటుడు నవాబ్‌ షాను పెళ్లి చేసుకున్నానని నటి, మాజీ మిస్‌ ఇండియా పూజా బాత్రా పేర్కొన్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ఢిల్లీలో తమ వివాహం జరిగిందని తెలిపారు. సోమవారం ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ...‘ నవాబ్‌ను ఇష్టపడుతున్నాని తెలిసిన తర్వాత పెళ్లికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావని నా స్నేహితులు తరచూ అడిగేవారు. అయితే తనని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే... నాకు జీవితాంతం తోడుగా నిలవగలడనే నమ్మకం కుదిరిన తర్వాత వెంటనే వివాహ బంధంలో అడుగుపెట్టాలనుకున్నా. అవును.. మేము పెళ్లి చేసుకున్నాం. ఢిల్లీలో నేను, నవాబ్‌ పెళ్లి ప్రమాణాలు చేశాం. ఇరు కుటుంబాల సన్నిహితుల ఆధ్వర్యంలో ఆర్యసమాజ్‌లో నిరాడంబరంగా మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వివాహాన్ని రిజిస్టర్‌ చేయించుకున్నాం’ అని పూజ చెప్పుకొచ్చారు.

కాగా 1993లో మిస్‌ ఇండియాగా ఎంపికైన పూజా బాత్రా 2011లోనే తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు. ఇక నవాబ్‌ షా భాగ్‌మిల్కాభాగ్‌, లక్ష్యా తదితర చిత్రాలలో నటించాడు. కొన్నిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట గత వారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో పూజా బాత్రా తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోమవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని

అదే కాదు.. చాలా చేశాను : నిధి అగర్వాల్‌

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

అది మా అందరి వైఫల్యం

ఆగస్టులో ఎవరు

జాన్‌ ఎటాక్‌

ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు

నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే

విశ్రాంతి లేదు

అంతా ఆశ్చర్యమే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!