ఆ విషయం అలియానే అడగండి : నటి

12 Jun, 2018 13:13 IST|Sakshi
బాలీవుడ్‌ నటి, దర్శక- నిర్మాత పూజా భట్‌

సాక్షి, ముంబై : రణ్‌బీర్‌ కపూర్‌- అలియా భట్‌లు ప్రేమలో ఉన్నారంటూ బీ- టౌన్‌లో వార్తలు విన్పిస్తోన్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌, సోదరి రిదిమా కూడా అలియాతో సత్సంబంధాలే కలిగి ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఆమెతో టచ్‌లో ఉండడంతో పాటు ఇటీవల రణ్‌బీర్‌ కుటుంబమంతా కలిసి అలియాను డిన్నర్‌కి కూడా తీసుకువెళ్లారు. తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామంటూ రణ్‌బీర్‌ అంగీకరించగా.. అలియా మాత్రం ఈ విషయంపై ఇంతవరకు స్పందించలేదు.

అయితే రణ్‌బీర్‌- అలియాల రిలేషన్‌షిప్‌ గురించి అలియా సోదరి పూజా భట్‌ను ప్రశ్నించగా.. ‘ఈ విషయం గురించి మీరు అలియానే అడగాలి. నా వ్యక్తిగత విషయాల గురించి అడిగితే సమాధానం చెప్పగలను కానీ నా సోదరి విషయంలో ఎలా మాట్లాడగలను’  అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా ‘ప్రస్తుతం అలియా కెరీర్‌ లైమ్‌లైట్‌లో ఉంది. తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఈ విషయంలో నేను, నాన్న(మహేష్‌ భట్‌) సంతోషంగా ఉన్నాం. తన కెరీర్‌ గురించి సలహాలు ఇవ్వగలం గానీ తన వ్యక్తిగత నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి ఎవరికీ హక్కు లేదంటూ’  వ్యాఖ్యానించారు. కాగా మహేష్‌ భట్‌ మొదటి భార్య కిరణ్‌ భట్‌ కూతురు పూజా భట్‌ నటిగా, ఫిల్మ్‌మేకర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు