ముంబైలోనే మకాం

28 Apr, 2019 03:40 IST|Sakshi

తిరిగి తిరిగి ముంబైలోనే మకాం పెట్టడానికి రెడీ అవుతున్నారు ‘సడక్‌’ టీమ్‌. 1991లో మహేశ్‌భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సడక్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘సడక్‌ 2’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ‘సడక్‌ 2’ చిత్రం కోసం మళ్లీ డైరెక్టర్‌ చైర్‌లో కూర్చోనున్నారు మహేశ్‌భట్‌. చివరిసారిగా 1999లో ‘కారతూస్‌’ చిత్రానికి దర్శకత్వం వహించారు మహేశ్‌భట్‌. తాజాగా ఆయన తీయనున్న ‘సడక్‌ 2’లో సంజయ్‌దత్, పూజా భట్, ఆలియా భట్, ఆదిత్యారాయ్‌ కపూర్‌ ముఖ్యతారలుగా నటించనున్నారు.

త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ని ముందుగా రొమేనియాలో ప్లాన్‌ చేశారు. అక్కడి లొకేషన్లను కూడా పరిశీలించారు. అక్కడి లొకేషన్స్‌ నచ్చినప్పటికీ లోకల్‌ కాస్ట్‌ అండ్‌ క్రూ, కొన్ని పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలోనే జరపాలనుకుంటున్నారు. ఆల్రెడీ ముంబైలోని ఓ స్టూడియోలో సెట్‌ వర్క్‌  స్టార్ట్‌ చేశారు. తొలుత సంజయ్‌దత్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు టీమ్‌. మే 15 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది.

మరిన్ని వార్తలు