హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి

1 Apr, 2020 11:24 IST|Sakshi

హీరో జీవా నటించిన తమిళ సినిమా ‘ముంగమూడి’తో(2012) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి పూజా హెగ్డే. ఆ తరువాత ఇప్పటివరకు మళ్లీ కోలీవుడ్‌లో నటించలేదు. అయినప్పటికీ తమిళ్‌లో బుట్టబొమ్మకు ఫాలోయింగ్‌ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమాతో పూజా కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. హీరో సూర్య నటిస్తున్న ‘అరువా’ సినిమాలో పూజా నటిస్తుందని సమాచారం. ఈ మూవీలో మొదట రష్మిక మందన్నను సంప్రదించగా.. కొన్ని కారణాలతో ఆమె నో చెప్పడంతో ఈ అవకాశం పూజాను వరించినట్లు వార్తలు వెలువడ్డాయి.  సింగం డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టూడియోగ్రీన్‌ సంస్థలో జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. (సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!)

ఇక ఈ విషయంపై పూజా స్పందించారు. తమిళంలో ప్రస్తుతం ఏ సినిమాలో నటించడం లేదని ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు. ‘‘హలో హలో! నేను తమిళంలో సినిమా చేస్తున్నానని ఇప్పుడే క్లారిటీకి రాకండి. ఇప్పటి వరకు ఏ తమిళ సినిమాను ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నాను. కానీ ఈ ఏడాది ఖచ్చితంగా ఒక తమిళ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అన్ని సవ్యంగా జరిగితే తప్పకుండా చేస్తాను. థ్యాంక్యూ’’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం పూజా.. రాధాకృష్ణ దర్శకత్వంలో డార్లింగ్‌ ప్రభాస్‌ నటిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌​ చిత్రంలోనూ కనిపించనున్నారు. (మరో చాన్స్‌ కొట్టేసిన బుట్ట బొమ్మ!)

‘బాధపడకు అమలాపాల్‌! నీ పంజాబీ భర్త..’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా