చేతిలోన చెయ్యేసి...

25 Aug, 2018 03:03 IST|Sakshi
ప్రభాస్‌

చేయి అందిస్తే చాలు చాకచక్యంగా భవిష్యవాణి చెప్పేస్తారట. సరదాగా ఫ్యూచర్‌ ఎలా ఉందో తెలుసుకోవాలని పూజా  హెగ్డే కూడా చెయ్యిచ్చారట. అంతే... చెయ్యి వదల్లేదట ప్రభాస్‌. కొంచెం తికమకగా ఉందా? ప్రభాస్‌ నెక్ట్స్‌ సినిమాలో జ్యోతిష్యుడి పాత్రలో కనిపించనున్నారట. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్‌స్టోరీ ఆగస్ట్‌ చివరి వారంలో స్టార్ట్‌ కావాల్సింది.

కానీ అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో స్టార్ట్‌ కానుందట. ఇందులో ప్రభాస్‌ హస్తసాముద్రికుడిగా కనిపిస్తారట. మరి ఇది నిజంగా సినిమాలో పూర్తి స్థాయి పాత్రా లేకపోతే పూజా హెగ్డేను ప్రేమలో పడేయడం కోసం చేసే ప్రయత్నమా తెలియాలి. ఈ పీరియాడికల్‌ మూవీ షూటింగ్‌ మొత్తం ప్యారిస్‌లో జరగనుంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారనే వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో పెళ్లి జరగనుందన్నది ఆ వార్త సారాంశం. ‘బాహుబలి’ అనే యజ్ఞం పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రభాస్‌ ఫైనల్‌గా పెళ్లికి ఓకే అన్నారట.

మరిన్ని వార్తలు