పశ్చాత్తాపం లేదు

21 Oct, 2019 02:16 IST|Sakshi
పూజాహెగ్డే

‘మొహంజోదారో’ చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టారు ఇప్పటి టాలీవుడ్‌ బిజీ హీరోయిన్‌ పూజాహెగ్డే. కానీ, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆమె నటించిన మరో సినిమా విడుదలకు దాదాపు మూడేళ్లు పట్టింది. తాజాగా అక్షయ్‌ కుమార్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాతో హిందీ తెరపై మెరవబోతున్నారీ బ్యూటీ.

‘మొహంజోదారో’ సినిమా విఫలం కావడం వల్లే బాలీవుడ్‌లో మీకు అవకాశాలు తగ్గాయా? అన్న ప్రశ్నను పూజా ముందు ఉంచితే...‘‘ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారీ చెబుతూనే ఉన్నాను. ఈ సినిమా చేసినందుకు పశ్చాత్తాపం లేదు. అప్పట్లో ఈ సినిమా చేయాలని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఇప్పటికీ నమ్ముతున్నాను. నా తొలి హిందీ సినిమాలోనే హృతిక్‌రోషన్‌ వంటి స్టార్‌ హీరోతో కలిసి నటించినందుకు సంతోషంగా ఉంది. ఇక సినిమా ఫలితం అన్నది నటీనటుల చేతుల్లో ఉండదు. ప్రేక్షకులు నిర్ణయిస్తారు. నేను నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు