ఎయిర్‌టెల్‌కు థ్యాంక్స్‌ చెప్పిన పూజా

3 Feb, 2020 13:02 IST|Sakshi

హీరోయిన్‌ పూజ హెగ్డే ఎయిర్‌టెల్‌కు థ్యాంక్స్‌ చెప్పారు. వివరాల్లోకి వెళితే.. పూజా ఇటీవల ఎయిర్‌టెల్‌ సర్వీస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్‌ సర్వీస్‌ చాలా చెత్తగా ఉందన్న పూజా.. రాంగ్‌ బిల్లింగ్‌ చేస్తున్నారని, కస్టమర్‌ సర్వీస్‌ బాగోలేదని విమర్శించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. అయితే దీనికి ఎయిర్‌టెల్‌ స్పందిస్తూ.. పూజాకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. అలాగే సమస్యను పరిష్కరించామని రిప్లై ఇచ్చింది. 

దీనికి బదులిచ్చిన పూజా.. ‘అవును.. చివరకు సమస్య పరిష్కారమైంది. హెల్ప్‌ చేసినందుకు థ్యాంక్స్‌. నా ఫిర్యాదు మిగతా ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందడానికి తోడ్పడిందని ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ఇటీవల ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంతో హిట్‌ అందుకున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు