మోదీకి సలహా ఇచ్చిన హీరోయిన్

12 Nov, 2016 12:56 IST|Sakshi
మోదీకి సలహా ఇచ్చిన హీరోయిన్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒకే చర్చ నడుస్తోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో ఇన్నాళ్లు బీరువాలకే పరిమితమైన నల్లధనం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అదే పెద్ద ఎత్తున ఈ నల్లధనం వేస్ట్ అవుతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమంగా డబ్బు దాచిపెట్టుకున్న చాలా మంది ఆ డబ్బు మార్చుకునే పరిస్థితి లేకపోవటంతో కాల్చేయటం పారేయటం లాంటివి చేస్తున్నారు. అయితే పరిణామాలపై ప్రధాని మోదీకి సలహా ఇచ్చింది, హీరోయిన్ పూజా హెగ్డే.

'2017 మార్చి వరకు పాత 500, 1000 రూపాయల నోట్లను హాల్సిటల్స్ లో డొనేషన్ గా ఇచ్చే అవకాశం కల్పించారు. అలా చేస్తే నల్లధనం ఓ మంచి పనికి ఉపయోగించే అవకాశం కలుగుతుంది. ఎలాంటి ఉపయోగం లేకుండా పడేయటం కన్నా.. ప్రజలు దానం చేయోచ్చు. ఆర్యోగ భద్రత పెరుగుతుంది'. అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున నల్లడబ్బు తగులబెడుతున్న వార్తలు, చెత్త కుండీల దగ్గర పడేస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పూజ సలహాకు మంచి స్పందన వస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి