సెక్స్‌ రాకెట్‌పై షాకింగ్‌ నిజాలు.. : పూనమ్‌

28 Jun, 2018 16:38 IST|Sakshi

సాక్షి, సినిమా: టాలీవుడ్ చిత్ర పరిశ్రమని వరుస వివాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. మొన్నిటి వరకు క్యాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్‌ని కుదిపేయగా.. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అయితే సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ కొంత మంది నటీమణులు సంచలన విషయాలను బయటపెట్టారు. తాజాగా ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌ సెక్స్‌ రాకెట్‌పై స్పందించారు. పూనమ్‌ దీనిపై ఎదుర్కొన్న సంచలన విషయాలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.  

సెక్స్‌ రాకెట్‌ ప్రధాన నింధితులుగా కిషన్ మోదుగుమూడి - అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే పూనమ్‌ అసలు కిషన్, చంద్ర దంపతులు భార్యాభర్తలు కాదని తెలిపారు. దంపతులు అనేది కేవలం లగ్జరీ జీవితం కోసం, ఇలాంటి నేరాలు చేయడానికి వారు వేసుకున్న ముసుగు మాత్రమేనని పూనమ్ కౌర్‌ పేర్కొన్నారు.

పూనమ్ అమెరికాలో ఉన్నపుడు తాను ఉన్న హోటల్‌ దగ్గరకి ఆ దంపతులకి సంబంధించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాడని పేర్కొన్నారు.  తనకు తెలుగు అర్థం కాదని మాట్లాడాడని.. కానీ నాకు తెలుగు అర్థమవుతుందని తెలిపారు. ఆ సమయంలో అతను చేసిన దానికి చెంప పగలగొట్టానని వెల్లడించారు. డబ్బు ఆశచూపి, భయపెట్టి అమెరికాలో అమ్మాయిలను లొంగదీసుకుంటారని పూనం పేర్కొన్నారు. అమెరికాలో మోసపోతున్న అమ్మాయిలని కాపాడాలని పూనమ్‌ ప్రధానమంత్రి మోదీని ఈ సందర్భంగా కోరారు. 

అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న వ్యభిచార రాకెట్
ఆయన మా జీవితాలతో ఆడుకుంటున్నాడు!
 

Received this case file couple of days back ... never spoke about this thing till date but would like to mention ... if it was not for my brother n few of his friends , pratap garu n few others .... I remember slapping one person as he did not know that I can understand Telugu and would have killed some one for knocking at my door middle of the night .... I was alone went thru a association n was only excited about meeting my school n family friends .... there so many people like these evil " husband and wife " duos who can do any thing for their comfort n luxuries n fake status in society .... they exactly know what they doing ... corner innocent n vulnerable woman n some times threaten them n it only happens with the back up of big big people who are never caught ....the lies which they say are not even a joke to convince a woman .... cornering a vulnerable woman ..... I wonder when they have places like #vegas why does one have to do this .... only for such " husband and wife's " who are crime partners to enjoy such luxuries .... @narendramodi ji apni betiyon ko bachao.... @oprah @barackobama @michelleobama .... u r the only hope ...... thank u .

A post shared by Puunam Khaur (@puunamkhaur) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు