జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు.. జాగ్రత్త

25 May, 2018 14:18 IST|Sakshi

సాక్షి, సినిమా : టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌ గురువారం ట్విటర్‌లో పెట్టిన పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. రెండు సినిమా పేర్లను వాడుతూ పూనమ్‌ 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి' అంటూ ట్వీట్‌ చేశారు. ఆ రెండు సినిమా పేర్లతో దర్శకుని పేరు చెప్పకుండా.. నమ్మకద్రోహి అంటూ ఆయన పేరు చెప్పకనే చెప్పారంటూ అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

అంతేకాకుండా ‘ఆ దర్శకుడు కేవలం ఆ నాలుగు కుటుంబాలకు దగ్గరగా ఉంటారని, ఎన్నారై హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడం ఆ దర్శకుడికి అలవాటని, నాకు హిట్లు లేవనే ఓ ఎన్నారై హీరోయిన్‌కు అవకాశం ఇచ్చాడని, మరి ఆ ఎన్నారై హీరోయిన్‌కు హిట్లు ఉన్నాయా? ఎన్నారై హీరోయిన్లు మీరు చెప్పిన ప‌నులు బాగా చేస్తార‌ని విన్నాను’ అంటూ పూనమ్ మరో ట్వీట్ చేశారు.  అలాగే మంచికి విలువ ఇస్తే.. చెడు జ‌రిగేది కాదు.. గాడ్ బ్లెస్‌ యూ ఆల్‌.. అంటూ పూనమ్ ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్లు సినీ ఇండస్ట్రీ, సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి. 

గతంలో ఒక సినీ దర్శకుడు తనను తరచూ అవమానపరుస్తున్నాడని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేసి.. ఆ దర్శకుడికి ఎక్కువ చిత్రాలేమీ లేవని, అయినా ఇతరుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాడని ఆరోపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు