‘నువ్వు చచ్చిపోతే ఒక రోజు వార్తలో ఉంటావు’

17 Jun, 2020 19:25 IST|Sakshi

టాలీవుడ్‌ నటి పూనమ్‌ కౌర్‌ తనదైన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్నటి వరకు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై స్పందించిన పూనమ్‌ తాజాగా ఓ దర్శకుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా తాను డిప్రెషన్‌తో పోరాడుతున్నట్లు పూనమ్‌ వెల్లడించారు. తను అలా కావడానికి ఓ తెలుగు డైరెక్టర్‌ కారణమంటూ పేర్కొన్నారు. దర్శకుడి పేరు వెల్లడించకుండా కేవలం గురూజీ అన్న హ్యష్‌ట్యాగ్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు. అతని వల్ల సినిమాలు, టెలివిజన్‌ ప్రకటనలతోపాటు అనేక అవకాశాలను కోల్పోయినట్లు పేర్కొన్నారు. (సల్మాన్‌ఖాన్‌పై సంచలన ఆరోపణలు..)

తన మానసిక ఆరోగ్యం గురించి వివరిస్తూ ఆ పరిస్థితులు తనను ఆత్మహత్య చేసుకునే వరకు ఎలా ప్రేరేపించాయో పూనమ్‌ వివరించారు. ‘నా స్నేహితురాలు ఒకటి రెండు సార్లు ఓ దర్శకుడిని సంప్రదించింది. పూనమ్ అనారోగ్యంతో బాధపడుతోందని తన ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. ఈ పరిస్థితి గురించి మనం తనకు ఏమైనా సహాయం చేయగలమా అని అడిగింది. అయినా దర్శకుడు ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు నేనే వెళ్లి  నా  పరిస్థితిని చెప్పాను. నేను పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇప్పుడేం చేయాలని అడిగాను. తను సమాధానం ఇవ్వలేదు. మళ్లీ నేను ఈ సమస్యను పరిష్కరించవచ్చా. నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని అడిగాను’. అంటూ తన బాధను చెప్పుకొచ్చారు. (సుశాంత్‌ ఆత్మహత్య; కరణ్‌కు మద్దతుగా వర్మ)

దీనికి బదులుగా వెంటనే ఆ దర్శకుడు ‘ఏమీ జరగదు నువ్వు చచ్చిపోతే ఒక రోజు న్యూస్‌లో ఉంటావు అంతే’ అని చెప్పినట్లు పూనమ్‌ పేర్కొన్నారు. ఈ మాటలు విని తను షాక్‌కు గురైనట్లు తెలిపారు. మీడియా, మూవీ మాఫీయా, ఆడ్వర్టైజ్‌మెంట్స్‌ అన్ని అతనితో కంట్రోల్‌లో ఉంటాయన్నారు. తనపై అనవసర కథనాలు ప్రచురించి మరింత వేదనకు గురిచేశాయన్నారు.. అతనికి అప్పుడే  డైరెక్టు సమాధానమిచ్చినట్లు స్పష్టం చేశారు. (నాకున్న స్నేహితులు ఇద్దరే: సుశాంత్‌)

‘నాతో మధ్య రాత్రి అయినా వస్తాను అనేవాడు. కానీ ఇప్పుడు చచ్చిపోతే ఒక రోజు న్యూస్‌లో ఉంటావు అనే వరకు వచ్చాడు. సమస్యకు పరిష్యారం కోసం తప్ప మరెందుకు తాను ఆ డైరెక్టర్‌ను సంప్రదించలేదు. తనుకున్న ఉన్నత పరిచయాలతో నన్ను తప్పుగా చిత్రీకరించాడు’ అని పేర్కొన్నారు. చివరగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తనను ఆశ్చర్యపరిచిందని, అతనిలాగే తన జీవితాన్ని అంతం చేసుకోవాలని లేదని తెలిపారు. ప్రస్తుతం డిప్రెషన్‌కు థెరపీ తీసుకుంటున్నట్లు పూనమ్‌ పేర్కొన్నారు. కాగా 2018లో సందీప్‌ కిషన్‌ నటించిన ‘నెక్స్ట్‌ ఏంటి’ సినిమాలో పూనమ్‌ చివరి సారిగా కనిపించారు.

మరిన్ని వార్తలు